LIVE : తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియా సమావేశం - KTR press meet in Hyd live - KTR PRESS MEET IN HYD LIVE
🎬 Watch Now: Feature Video
Published : May 15, 2024, 1:34 PM IST
|Updated : May 15, 2024, 1:54 PM IST
KTR Live : లోక్‌సభ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు భారత్ రాష్ట్ర సమితికి మద్దతుగా నిలిచారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా వేయనందుకు కాంగ్రెస్‌పై రైతులు ఆగ్రహంతో ఉన్నారన్న ఆయన, రుణమాఫీ విషయంలో మోసం చేశారని అన్నదాతలు మండిపడుతున్నారన్నారు. అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించిన కేటీఆర్, నెలకు రూ.2500 ఇవ్వలేదని రాష్ట్రంలోని మహిళలు సైతం కాంగ్రెస్ ప్రభుత్వంపై కోపంతో ఉన్నారని దుయ్యబట్టారు.భారతీయ జనతా పార్టీపైనా ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్న కేటీఆర్, పెట్రోల్, నిత్యావసరాల ధరలు పెరిగినందుకు మోదీపై కోపంతో ఉన్నారని తెలిపారు. దిల్లీలో దోస్తీ - గల్లీలో కుస్తీ అన్నట్లుగా బీజేపీ-కాంగ్రెస్ పార్టీల వైఖరి ఉందని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే ఈసారి కేంద్రంలో ఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యం వచ్చే పరిస్థితి లేదని, ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే కూటమే దిల్లీలో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తాజాగా ఇవాళ హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చంపేటలో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేతల దాడులపై కేటీఆర్ స్పందించారు. అధికార దుర్వినియోగంతో ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారని విమర్శించారు.
Last Updated : May 15, 2024, 1:54 PM IST