కార్యకర్తల సంక్షేమం కోసం కట్టుబడి ఉండే పార్టీ బీఆర్ఎస్ : కేటీఆర్ - KTR On BRS Party Workers - KTR ON BRS PARTY WORKERS
🎬 Watch Now: Feature Video
Published : May 25, 2024, 5:02 PM IST
KTR On BRS Party Workers : కార్యకర్తల సంక్షేమం కోసం కట్టుబడి ఉండే పార్టీ బీఆర్ఎస్ అన్న ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఏ కష్టం వచ్చినా పార్టీని సంప్రదించాలని చెప్పారు. ఇటీవల మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులను ఆయన తెలంగాణ భవన్లో పంపిణీ చేశారు. కార్యకర్తలు కేసీఆర్ కుటుంబంలో సభ్యులే అన్న ఆయన బీమా కేసీఆర్ మదిలో నుంచి పుట్టిన ఆలోచన అని వివరించారు.
బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకునే అందరికీ ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున బీమా మొత్తాన్ని అందిస్తున్నామన్న కేటీఆర్ ఇప్పటి వరకు రూ.118 కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల బీమా కోసం వెచ్చించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 5522 మందికి రూ.110 కోట్ల రూపాయల మేర లబ్ది జరిగిందని వివరించారు. అధికారంలో లేనంత మాత్రాన ఇది ఆగిపోదని, భవిష్యత్లో కూడా కొనసాగుతుందని కేటీఆర్ తెలిపారు.