LIVE : మహిళా కమిషన్ ఎదుట హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్ - KTR LIVE - KTR LIVE
🎬 Watch Now: Feature Video
Published : Aug 24, 2024, 1:17 PM IST
|Updated : Aug 24, 2024, 1:24 PM IST
KTR Live : మహాలక్ష్మి ఉచిత ఆర్టీసీ బస్సు పథకంపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేడు రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. భారత రాష్ట్రసమితి మహిళ ప్రతినిధులు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు కేటీఆర్ వెంట వచ్చారు. హైదరాబాద్ బుద్ధ భవన్‌లోని మహిళ కమిషన్ ముందు హాజరైన ఆయన, తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. కేటీఆర్‌తోపాటు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు బీఆర్ఎస్ మహిళా కార్పొరేట్లకు అనుమతి ఇవ్వకపోవడంతో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత నేతృత్వంలో ఆ పార్టీ శ్రేణులు బుద్ధభవన్ వద్ద ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్‌కు పోటాపోటీగా బీఆర్ఎస్ మహిళ శ్రేణులు కూడా ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పరస్పరం తోపులాటలు, నినాదాలతో మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట పరిస్థితి రణరంగంగా మారింది. కమిషన్ ఎదుట హాజరైన కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు.
Last Updated : Aug 24, 2024, 1:24 PM IST