LIVE : తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియా సమావేశం - KTR Press Meet In Hyd Live - KTR PRESS MEET IN HYD LIVE
🎬 Watch Now: Feature Video
Published : Aug 9, 2024, 11:20 AM IST
|Updated : Aug 9, 2024, 11:35 AM IST
KTR Live From Telangana Bhavan LIVE : సుంకిశాల ప్రాజెక్టుపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ నీటి అవసరాల కోసం గతంలో సుంకిశాల ప్రాజెక్టు మెుదలు పెట్టామని వివరించారు. సుంకిశాల ప్రాజెక్టుకు పునరుజ్జీవనం తెచ్చిందే బీఆర్‌ఎస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. నాగార్జునసాగర్‌లో డెడ్‌స్టోరేజ్ ఉన్నా హైదరాబాద్‌కు నీటి కష్ట్రాలు రాకూడదనే ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు. రాజధానితో పాటు చుట్టుపక్కల గ్రామాలకు సాగు, తాగునీటి కోసం ఉపయోగపడుతుందని, కృష్ణానదికి నాలుగేళ్లు నీరు రాకపోయినా సుంకిశాల ప్రాజెక్టుతో నీటి ఇబ్బందులు రావని పేర్కొన్నారు. బెంగళూరు, దిల్లీ, చెన్నైలో నీటి ట్యాంకర్ల కోసం ప్రజలు పోరాడుతున్నారని, హైదరాబాద్‌లో నీటి కోసం ఇబ్బందు పడే పరిస్థితి లేదని వివరించారు. హైదరాబాద్ 50 ఏళ్లు తాగునీటి అవసరాలకు సరిపడేలా ప్రణాళికలు గతంలో తాము చేసినట్లు చెప్పుకొచ్చారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. పెట్టుబడులు పేరిట సరికొత్త దోపిడీకి పూనుకున్నారని ఆరోపించారు.
Last Updated : Aug 9, 2024, 11:35 AM IST