రేవంత్ రెడ్డి నాకు 18 ఏళ్ల నుంచే తెలుసు - ఆయన నాకు మంచి మిత్రుడు : కేటీఆర్ - KTR on CM Revanth - KTR ON CM REVANTH
🎬 Watch Now: Feature Video
Published : Jul 31, 2024, 3:06 PM IST
KTR on CM Revanth Reddy in Assembly : బుధవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏకవచనంతో కేటీఆర్ పిలవడంపై అధికార పక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. '‘రేవంత్ రెడ్డి నాకు 18 ఏళ్ల నుంచే తెలుసు. ఆయన నాకు మంచి మిత్రుడు. అయితే గత పదేళ్ల నుంచి మాకు, ఆయనకు చెడింది. ఆయన అదృష్టవంతుడు, చిన్న వయసులోనే సీఎం అయ్యారు. సీఎంను ఏకవచనంతో పిలిచినందుకు ఎవరైనా బాధపడి ఉంటే నా మాటలను వెనక్కి తీసుకుంటున్నాను' అని కేటీఆర్ అన్నారు.
ఈ క్రమంలో కేటీఆర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన గురించి ప్రస్తావించారు. పదేళ్ల క్రితం తాము అధికారంలోకి వచ్చినప్పుడు రూ.1800 ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేశామని పేర్కొన్నారు. పదేళ్ల తమ పాలనలో అనుమానం ఉంటే చర్యలు తీసుకోవాలని కోరారు. పాలమూరు జిల్లాలో మెుత్తం రిజర్వాయర్లు తామే కట్టామని వ్యాఖ్యానించారు.