దుబాయ్‌లో ఏపీ మహిళ కష్టాలు - స్వదేశానికి తీసుకురావాలని ఆవేదన - వీడియో వైరల్ - AP Woman in Dubai - AP WOMAN IN DUBAI
🎬 Watch Now: Feature Video
Published : Aug 5, 2024, 7:25 PM IST
Konaseema District Women Facing Difficulties in Dubai : ఆర్థిక ఇబ్బందులతో దుబాయ్ వెళ్లిన మహిళ తనను స్వదేశానికి తీసుకురావాలని అభ్యర్థిస్తూ విడుదల చేసిన వీడియో, ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం శివారువీధివారి లంక గ్రామానికి చెందిన కాశీ జ్యోతి అనే వివాహిత నాలుగు నెలల క్రితం ఏజెంట్ సాయంతో దుబాయ్‌కు వెళ్లారు. అక్కడ అరబ్‌షేక్ ఇంట్లో పనిలో చేరారు. దుబాయ్‌కు వెళ్లినప్పటి నుంచి బాధిత కాశీ జ్యోతికి కష్టాలు మొదలయ్యాయి. పనిభారం పెరిగి, తిండి సరిగా లేక అనారోగ్యానికి గురయ్యానంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.
తన పరిస్థితి బాగలేకపోయినా పని చేయమని ఒత్తిడి చేస్తున్నారని కాశీ జ్యోతి కన్నీరు పెట్టుకున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి తమను స్వదేశానికి రప్పించే ఏర్పాటు చేయాలని వేడుకున్నారు. ఇటీవల నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోయి ఓమన్‌లో చిక్కుకున్న మామిడి దుర్గ అనే మహిళకు ఏపీ మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. బాధితురాలిని స్వస్థలానికి తీసుకొచ్చే బాధ్యతను ఆయన తీసుకున్నారు. కేంద్రంతో మాట్లాడి ఆమెను స్వస్థలానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని పార్టీ ఎన్నారై విభాగానికి లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు.