LIve : రాష్ట్రంలో విద్యావ్యవస్థ నిర్వీర్యం- టీడీపీ నేత కొల్లు రవీంద్ర మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం - విద్యారంగం పై కొల్లు రవీంద్ర
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 1, 2024, 2:18 PM IST
|Updated : Mar 1, 2024, 2:35 PM IST
Kollu Ravindra On Education System Live : రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి రోజురోజుకూ హీన స్థితికి పోతుందని టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్ర విమర్శించారు. విద్యారంగం పై కొల్లు రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు హయాంలో దేశంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్ర విద్యారంగాన్ని జగన్ పాలనలో అథమస్థాయికి దిగజార్చారని మాజీ మంత్రి మండిపడ్డారు. రాష్ట్రంలో 50వేల ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందన్న కేంద్రమంత్రి వ్యాఖ్యలపై జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే 26వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తానన్న హామీని ఎందుకు అమలు చేయలేదో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తల్లి, భార్యతో అమ్మఒడి పథకంపై ప్రచారం చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక దానికి ఎందుకు కోతలు పెట్టాడని నిలదీశారు. ఉపాధ్యాయులపై పనిభారం పెంచి, యాప్ల పేరుతో వారిని వేధిస్తూ జగన్ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. నాడు-నేడు అయినా ట్యాబ్ల పంపిణీ అయినా జగన్ రెడ్డికి కావాల్సింది కమీషన్లే అని దుయ్యబట్టారు.
Last Updated : Mar 1, 2024, 2:35 PM IST