సికింద్రాబాద్ ఎంపీగా మా ఆయననే గెలిపించండి - కిషన్ రెడ్డి సతీమణి ప్రచారం - Kishan Reddy Wife Campaign - KISHAN REDDY WIFE CAMPAIGN
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-05-2024/640-480-21383625-thumbnail-16x9-bjp.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : May 4, 2024, 1:46 PM IST
Kishan Reddy Wife Election Campaign In Hyderabad : ప్రతి మగాడి విజయం వెనక ఓ స్త్రీ ఉంటుందంటారు. నిజమే అని నిరూపిస్తామంటూ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న భర్తల తరఫున భార్యలు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారాలు చేస్తున్నారు. భర్త గెలుపు కోసం మండుటెండల్లో చెమటోడుస్తున్నారు. మా ఆయనకే ఓటు అంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
BJP Election Campaign 2024 : తాజాగా సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని గెలిపించాలని ఆయన సతీమణి కావ్య కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఇందిరా పార్కులో కావ్య కిషన్ రెడ్డి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని వాకర్స్‌ను అభ్యర్థించారు. ఇందిరాపార్కు వచ్చి వాకింగ్ చేసి తిరిగి వెళుతున్న వాకర్స్‌కు బీజేపీ కరపత్రాలను అందజేసి తన భర్త కిషన్ రెడ్డిని గెలిపించాలని విన్నవించారు. సికింద్రాబాద్‌లో తన భర్త చేసిన అభివృద్ది గురించి ప్రజలకు తెలియజేశారు.