LIVE : సికింద్రాబాద్ అభివృద్ధిపై కిషన్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ - kishan reddy live - KISHAN REDDY LIVE
🎬 Watch Now: Feature Video
Published : Apr 18, 2024, 12:09 PM IST
|Updated : Apr 18, 2024, 2:04 PM IST
Kishan Reddy Presentation on Secunderabad Development Live : సికింద్రాబాద్ అభివృద్ధిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. లోయర్ ట్యాంక్ బండ్‌లోని వెంకట్ రాంరెడ్డి ఫంక్షన్ హాల్లో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో కేంద్రమంత్రిగా ఐదేళ్లలో తెచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రజలకు వివరిస్తున్నారు. మరొక్కసారి తనకు ఓటు వేయాల్సిన అవశ్యకతను కిషన్‌రెడ్డి ప్రజలకు తెలుపుతున్నారు. అలాగే తెలంగాణలోని మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు గానూ రెండంకెల స్థానాలు గెలవాలని బీజేపీ అధిష్ఠానం కంకణం కట్టుకుంది. అత్యధిక స్థానాలు గెలిచి తమ పట్టుకుు తెలంగాణలో పెంచుకోవాలని కమలం పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సభలు, రోడ్డు షోలు, బహిరంగ సభలతో ప్రచారాన్ని వేగవంతం చేసింది. నేటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న కౌంటింగ్ ప్రారంభం కానుంది.
Last Updated : Apr 18, 2024, 2:04 PM IST