హైడ్రా పనితీరును ప్రజలు ప్రశంసిస్తున్నారు : కోదండరెడ్డి - Kodanda Reddy About Hydra - KODANDA REDDY ABOUT HYDRA
🎬 Watch Now: Feature Video


Published : Aug 26, 2024, 3:10 PM IST
Congress Leader Kodanda Reddy on Hydra : భవిష్యత్ తరాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి చెరువులు, కుంటలు, నాలాలను పరిరక్షిస్తోందని కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్న హైడ్రా పనితీరును ప్రజలు ప్రశంసిస్తుంటే విపక్షాలు విమర్శించడం సరికాదని అన్నారు. సామాన్య ప్రజలు పూర్తి మద్దతు ప్రకటిస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రకృతిని కాపాడాలంటే చెరువును రక్షించాలన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేసి ప్రజల మన్ననలు పొందుతుంటే ఎంఐఎం, బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 2014 నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అక్రమ నిర్మాణాలకు సపోర్టు చేసిందని ఆరోపించారు. హుస్సేన్‌సాగర్‌ను కాపాడుకోవాలని విజయభాస్కర్ రెడ్డి కాలంలో బుద్దపూర్ణిమ ప్రాజెక్ట్, నెక్లెస్ రోడ్ ఏర్పాటైందని గుర్తు చేశారు. ధర్మం కోసం భగవద్భీతను కూడా స్ఫూర్తిగా తీసుకున్నానని సీఎం చెప్పారన్నారు. హెచ్ఎండీఏలో కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని కోదండరెడ్డి ఆరోపించారు.