నిరూపయోగమైన ప్లాస్టిక్‌తో మూగజీవాలకు ఆహారం - Nihit Machine in Hyderabad - NIHIT MACHINE IN HYDERABAD
🎬 Watch Now: Feature Video
Published : Apr 6, 2024, 4:36 PM IST
Kiran Making Nihit Machine in Hyderabad : భూమ్మీద పేరుకుపోతున్న ప్లాస్టిక్ భూతాన్ని చూసి దాన్ని రూపుమాపేందుకు ఏదైనా చేయాలనుకున్నాడు. చిన్ననాటి నుంచి తనకున్న అభిరుచిని ఇందులో ఇమడ్చాలనుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే మూగజీవాలకు ఫుడ్ అందించేలా ఓ పరికరాన్ని రూపొందించాడు. అవరోధాలు ఎదురైనా ఆత్మస్తైర్యం కోల్పోలేదు. తల్లిదండ్రులు, స్నేహితుల సాయంతో అనుకున్నది సాధించాడు.
Recycling Machine Provides food for Stray Dogs : నోరు లేని మూగ జీవాల పరిస్థితి ఏంటీ అని ఆలోచించాడు ఆ యువకుడు. అందుకే అలాంటి జీవులు కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. అంతేకాదు తను చేసే పనితో పర్యావరణానికి మేలు జరగాలని నిర్ణయించుకున్నాడు. ప్లాస్టిక్ భూతాన్ని సమాజం నుంచి తరిమి వేసి ఆ ప్రతిఫలంతో నోరు లేని జీవాల కడుపు నింపాలనే ధృడ సంకల్పంతో ముందుకు వెళ్తున్నాడు. భవిష్యత్తులో నిహిట్ పేరుతో మెషిన్ తయారుచేసి దేశవ్యాప్తంగా మూగజీవాల ఆకలి తీర్చుతానంటున్న కిరణ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.