షిర్డీలో సాయి పరిక్రమ కార్యక్రమం - భారీగా తరలివచ్చిన భక్తులు - ఖండోబా ఆలయంలో సాయి పరిక్రమ
🎬 Watch Now: Feature Video
Published : Feb 13, 2024, 7:40 PM IST
Khandoba Festival in Shirdi : మంగళవారం తెల్లవారుజామున షిర్డీలో సాయి పరిక్రమ కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. చేతుల్లో గొడుగుతో బాబాను ఊరేగిస్తూ దైవారాధనలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సాయిబాబా ప్రదక్షిణ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఖండోబా ఆలయంలో వేద పండితులు ఆచారంగా పూజలు నిర్వహించారు. సాయి చిత్రపటాల ఊరేగింపుతో ఈ (Sai parikrama) కార్యక్రమం మొదలైంది.
ప్లేగు మహమ్మారి బారిన పడి జనాలు మృత్యువాత పడినప్పుడు షిర్డీ ప్రజలను రక్షించడానికి సాయిబాబా షిర్డీ (Shirdi) సరిహద్దులో పిండిని చల్లి వ్యాధిని అరికట్టారని ప్రతీతి. ఆనాటి నుంచి ప్రతీ ఏటా ఫిబ్రవరిలో షిర్డీలో సాయి పరిక్రమ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఖండోబా (Khandoba) ఆలయంలో పూజలు, పుణే, నాగ్‌పూర్, బీడ్‌కు చెందిన వస్త్ర వాద్య బృందం, సాయిరత్, పాల్ఖి, సాయి జీవిత చరిత్ర చిత్రరథం, లజీమ్ ట్రూప్‌తో పాటు విద్యార్థుల వీధి నాటకం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రదక్షిణ మహోత్సవానికి తరలివచ్చిన వేలాది సాయి భక్తుల దైవనామస్మరణతో సాయినగరి మారుమోగింది.