ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు కేసీఆర్ పరామర్శ - KCR condoled death of MLA father - KCR CONDOLED DEATH OF MLA FATHER
🎬 Watch Now: Feature Video
Published : Apr 10, 2024, 3:33 PM IST
KCR Condoled Death of MLA Sanjay Kumar Father : జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌ను మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ తండ్రి సీనియర్ న్యాయవాది మాకునూరి హన్మంతారావు ఇటీవల మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం నాడు పరామర్శించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఆయనను కలుసుకున్నారు.
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తండ్రి హన్మంతరావు 13 వ రోజు కార్యక్రమం జగిత్యాల వీరుపాక్షిగార్డెన్లో జరిగింది. ఈ సందర్భంగా జగిత్యాలకు వచ్చిన కేసీఆర్ హన్మంతరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హన్మంతరావు చిత్రపటం ముందు పూలు వేసి నివాళులర్పించారు. కేసీఆర్ జగిత్యాలకు వచ్చారన్న వార్తను తెలుసుకున్న ఆయన అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జగిత్యాలకు చేరుకున్నారు. వారితో బీఆర్ఎస్ అధినేత కాసేపు ముచ్చటించారు. అనంతరం అక్కడి నుంచి తిరుగుపయనమయ్యారు. ఆయన వెంట మాజీ మంత్రులు హారీశ్ రావు, ప్రశాంత్ రెడ్డిలు పాల్గొన్నారు.