'రాజ్యాధికారం కోసం కాపులు ఐక్యం కావాలి'- ఈనెల 16న కాపు ప్రతినిధుల సమావేశం - కాపు ప్రతినిధుల సమావేశం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 12, 2024, 5:48 PM IST
Kapu JAC Leaders Press Meet: కాపు ప్రతినిధుల సమావేశం విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ (Vijayawada SS Convention)లో ఈనెల 16న ఏర్పాటు చేసినట్లు కాపు జేఏసీ నేతలు(Kapu JAC Leaders) తెలిపారు. కాపు ఐక్యత, రాజ్యాధికారం కోసం అందరూ సహకరించాలని కోరారు. ఒకప్పుడు కింగ్ మేకర్లుగా ఉన్న కాపులు ఇప్పుడు రాజ్యాధికారం కోసం పరుగులు పెడుతున్నారన్నారు. జరగబోయే సమావేశంలో ప్రస్తుత, గత ప్రభుత్వంలో కాపులకు చేసిన కార్యక్రమాలపై చర్చించుకుని ఆయా రాజకీయ పార్టీలకు తెలుపుతామన్నారు.
"రాష్ట్రంలో 25 శాతం ఉన్న కాపులు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. రాజ్యాధికారం వైపుగా కాపు సామాజిక వర్గం వెళ్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్లో కాపు ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో ప్రస్తుత, గత ప్రభుత్వంలో కాపులకు చేసిన కార్యక్రమాలపై చర్చించుకుని ఆయా రాజకీయ పార్టీలకు తెలుపుతాం. కాపు ఐక్యత, రాజ్యాధికారం కోసం అందరూ సహకరించాలని కోరుతున్నాం." - జనార్ధన్, కాపు జేఏసీ నాయకుడు