ఈ డ్రోన్ షాట్ ఎప్పుడూ చూసిఉండరు! - నిజంగా 'ఇంద్రకీలాద్రే' - vijayawada Drone view - VIJAYAWADA DRONE VIEW
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 4, 2024, 5:25 PM IST
Kanakadurgamma Temple Glows in the Light of Electric Lamp Drone Footage : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణం విద్యుత్దీపకాంతులతో శోభాయమానంగా వెలిగిపోతుంది. పచ్చని ప్రకృతి నడుమ అమ్మవారి ఉత్సవాలు మిన్నంటాయి. కృష్ణమ్మ ఒడిలో దుర్గమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రోజుకో అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు రెండో రోజు అమ్మవారు గాయత్రీదేవిగా దర్శనమిచ్చారు. గాయత్రీ దేవి అలంకరణలో ఉన్న దుర్గామాతకు మొక్కులు చెల్లించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు, భవానీలు తరలివచ్చారు.
పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్ఠాన దేవతగా అమ్మవారిని కొలుస్తారు. కొబ్బరి అన్నాన్ని నివేదనగా సమర్పిస్తారు. సకల మంత్రాలకు, వేదాలకు మూలమైన దేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి. మహత్తర శక్తిగల జగన్మాత ఐదు ముఖాలతో వరదాభయ హస్తాలు ధరించి కమలాసనాసీనురాలిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దీంతో కోలాహలం నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.