'సౌదీలో నరకయాతన అనుభవిస్తున్న - దయచేసి నన్ను కాపాడండి సార్' - Man Facing Problems In Saudi - MAN FACING PROBLEMS IN SAUDI
🎬 Watch Now: Feature Video
Published : Aug 6, 2024, 6:46 PM IST
Kamareddy Man Facing Problems In Saudi : బతుకుదెరువు కోసం ఖండాంతరాలు దాటి సౌదీకి వెళ్లిన ఓ వ్యక్తి, అక్కడ పడరాని పాట్లు పడుతున్నాడు. విదేశంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా వీడియో సందేశంలో ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తమ కుమారుడిని భారత్కు రప్పించాలని కోరుతున్నారు.
ఉన్న ఊరిలో ఉపాధి లేకపోవడం, పెరిగిపోతున్న అప్పులను తీర్చేందుకని కామారెడ్డి జిల్లా శాబ్దీపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ మున్నా ఏడాదిన్నర క్రితం సౌదీకి వెళ్లాడు. అతడు వెళ్లిన కొద్దికాలానికి అతడి తండ్రి షరీఫ్ కూడా సౌదీ వెళ్లారు. అక్కడికి చేరుకున్నాక గుండెపోటునకు గురై జూన్7న షరీఫ్ మరణించారు. జులై 27న మృతదేహాన్ని ఇంటికి చేర్చి దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఇప్పటికే కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. మున్నా కూడా సౌదీలో నరకయాతన అనుభవిస్తున్నానని వీడియో సందేశంలో సమాచారం అందించడంతో తల్లి తీవ్ర మనోవేదనకు గురవుతోంది. ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ కుమారుడిని సురక్షితంగా స్వదేశం రప్పించాలని మున్నా తల్లి ఫాతిమా వేడుకుంటోంది.