కాలవ 47వ సెల్ఫీ వీడియో విడుదల - కాలవ 50వారాల సెల్ఫీ ఛాలెంజ్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 5, 2024, 1:17 PM IST
Kalava 47th Selfie Challenge in Anantapur District : తెలుగుదేశం పార్టీ బడుగు, బలహీన వర్గాలకు రాజకీయంగా, ఆర్థికంగా పెద్ద పీట వేసిందని అనంతపురం జిల్లా రాయదుర్గం టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. తన 50వారాల సెల్ఫీ ఛాలెంజ్ (Selfie Challenge) లో భాగంగా టీడీపీ హయాంలో 'భూమి కొనుగోలు' పథకం ద్వారా లబ్ధి పొందిన దళిత మహిళలతో కలిసి ఆయన 47వ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఎంతో మంది భూమి లేని దళిత కూలీ మహిళలకు వ్యవసాయ భూములను కేటాయించి వారిని రైతులుగా మార్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశమేనన్నారు.
Kalava Srinivasulu Selfie Challenge to Rayadurgam : దళితుల కోసం ప్రవేశ పెట్టిన ఇలాంటి సంక్షేమ పథకాలను సీఎం జగన్ (CM Jagan) ఎందుకు కొనసాగించడం లేదని కాలవ ప్రశ్నించారు. ఐదేళ్లు ఎమ్మెల్యే, ఆరేళ్లు ఎమ్మెల్సీగా ఉన్న మెట్టు గోవింద రెడ్డి రాయదుర్గంలో (Rayadurgam) సంక్షేమ కార్యక్రమం ఒక్కటైనా చేశారా అని నిలదీశారు. మెట్టు లాంటి అసమర్థులకు ఓటు వేస్తే దళితులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు.