నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరాను : కడియం శ్రీహరి - Kadiyam Srihari Election Campaign - KADIYAM SRIHARI ELECTION CAMPAIGN
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-05-2024/640-480-21392205-thumbnail-16x9-kadiyam-srihari.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : May 5, 2024, 3:32 PM IST
Kadiyam Srihari Interesting Comments on KCR : గత పదేళ్లలో మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరానని స్పష్టం చేశారు. వరంగల్ పార్లమెంట్‌లోని ఎన్నికల ప్రచారంలో భాగంగా హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామంలో జరిగిన కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు.
Kadiyam Srihari Fires on KCR : గత పదేళ్లలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని, అవినీతి, భూ కబ్జాలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారని కడియం శ్రీహరి అన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత దిల్లీ లిక్కర్ స్కాంలో జైల్లో ఉందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే అభివృద్ది చేస్తానని మాట ఇచ్చానని కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాలేదని చెప్పారు. అభివృద్ది కోసమే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.