ఓటమి సంకేతాలతో వైఎస్సార్సీపీ నాయకుల్లో అసహనం పెరిగింది: కందికుంట వెంకటప్రసాద్‌ - Kandikunta on Sajjala Comments - KANDIKUNTA ON SAJJALA COMMENTS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 31, 2024, 7:37 PM IST

Kadiri TDP Candidate Kandikunta on Sajjala Comments: ఓటమి తప్పదన్న సంకేతాలతోనే వైఎస్సార్సీపీ నాయకుల్లో అసహనం మరింత పెరిగిపోయిందని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తెలుగుదేశం అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ విమర్శించారు. కౌంటింగ్ ఏజెంట్లను ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. సీఎం జగన్​కు, ఆ పార్టీ శ్రేణులకు ప్రజాస్వామ్యం పట్ల విశ్వసనీయత లేదని సజ్జల వ్యాఖ్యలతో స్పష్టమైందన్నారు. ఎన్నికల ఫలితాల రోజు, ఆ తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని టీడీపీ శ్రేణులకు వెంకటప్రసాద్ విజ్ఞప్తి చేశారు.

"ఓటమి సంకేతాలతో వైఎస్సార్సీపీ నాయకుల్లో అసహనం పెరిగిపోయింది. సీఎం జగన్​కు, ఆ పార్టీ శ్రేణులకు ప్రజాస్వామ్యం పట్ల విశ్వసనీయత లేదని సజ్జల వ్యాఖ్యలతో స్పష్టమైంది. వైఎస్సార్సీపీ నేతలకు ప్రజాస్వామ్యం పట్ల విశ్వసనీయత లేదు. నాలుగో తేదీన కూటమి అధికారంలోకి రావడం ఖాయం. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల రోజు, ఆ తర్వాత టీడీపీ శ్రేణులు సహనం పాటించాలని కోరుతున్నా." - కందికుంట వెంకటప్రసాద్‌, టీడీపీ అభ్యర్థి 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.