అనుచరులకు జేసీ ప్రభాకర్​రెడ్డి స్వీట్ వార్నింగ్ - పద్ధతి మార్చుకోవాలని హితవు - JC Prabhakar Reddy on Illegal Sand - JC PRABHAKAR REDDY ON ILLEGAL SAND

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2024, 12:20 PM IST

JC Prabhakar Reddy on Illegal Sand : తాడిపత్రి నియోజకవర్గంలో కార్యకర్తలు అక్రమంగా ఇసుక తవ్వకాలు చేసి తనకు దూరం కావద్దని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్​రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా తన అనుచరులను ఉద్దేశించి ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తాను ఇసుక మాఫియాతో పోరాడి హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించానని తెలిపారు. ఆ పోరాటానికి మీరు కూడా సహకరించారని గుర్తు చేశారు. 

Illegal Sand Mining in Tadipatri : కానీ తన అనుచరులు ఇప్పుడు ఇసుక మాఫియా దందా చేయడాన్ని జేసీ ప్రభాకర్​రెడ్డి తప్పుబట్టారు. ''ఇసుక అక్రమ తవ్వకాలపై పోరాడిన మనమే అక్రమంగా ఇలా చేయడం సరికాదు. మీకు ఆర్థిక ఇబ్బందులుంటే వేరే ఏర్పాటు చేస్తా. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలి.  నియోజకవర్గంలో 25 మంది ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. వారు వెంటనే ఆ పనులు ఆపేసి ఇతర ప్రాంతాలకు వెళ్లి పోవాలి.'' అంటూ జేసీ ప్రభాకర్​రెడ్డి వీడియో విడుదల చేశారు. ఇప్పుడు ఈ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.