'జనసేన కార్యాలయం ఎదురుగా వైసీపీ జెండాలు' - YCP committing acts of incitement
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 31, 2024, 8:16 AM IST
Janasena Leaders Angry That YSRCP Provocative Acts: గుంటూరు జిల్లా మంగళగిరిలో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర నిర్వహిస్తున్న సందర్భంగా అధికార పార్టీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని జనసేన నేతలు దుయ్యబట్టారు. జనసేన కార్యాలయం ఎదురుగా వైసీపీ జెండాలు కట్టడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాత్ర నిర్వహించే మార్గంలో జెండాలు ఏర్పాటు చేసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ కావాలనే వైసీపీ నేతలు తమ కార్యాలయం ఎదురుగా జెండాలు కట్టారని జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. అధికార పార్టీ నేతలు ఇదే ధోరణిని అవలంబిస్తే ప్రతి చర్యలు తప్పవని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూసుకోవాలంటు జనసేన నేతలు సున్నితంగా హెచ్చరించారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన-టీడీపీలు కలిసికట్టుగా పోటీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ రెండు పనిచేయనున్నాయి. జనసేన పార్టీ సీట్ల కేటాయింపుపై ఇంకా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం జనసేన పార్టీకి రాజానగరం, రాజోలు నియోజకవర్గాల్లో సీట్లను కేటాయింపు చేశారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రెండు పార్టీలు సభల నిర్వహణలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.