'ఎమ్మెల్యే భూమనను కలిసిన కలెక్టర్' - ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న టీడీపీ-జనసేన - Lakshmi Shah
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 2, 2024, 5:17 PM IST
TDP janasena Pressmeet : ఎన్నికల విధుల్లో భాగంగా బదిలీపై వచ్చిన అధికారులు ఎమ్మెల్యే భూమనను కలవడం ఏంటనిని జనసేన, టీడీపీ నాయకులు ప్రశ్నించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్ రాయల్, టీడీపీ నేత విజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, నగర పాలక కమిషనర్ అదితి సింగ్ వ్యవహరించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్కు అనుకూలంగా వ్యవహరించే అధికారులతో ఎన్నికలు పారదర్శకంగా ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార బాధ్యతల్లో భాగంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అధికారులు ఎమ్మెల్యేను కలవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించిన ఇద్దరు ఐఏఎస్ అధికారులపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
తమకు అనుకూలంగా ఉన్న అధికారులను అధికార పార్టీ నాయకులు బదిలీ చేయించుకుంటున్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపాల్సిన అధికారులు ఇలా వ్యవహరించడం సరికాదు. కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన లక్ష్మీ షా ఒక్క రోజైనా గడవకముందే కరుణాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి పుష్పగుచ్ఛం ఇచ్చి సన్మానించడం దేనిని సూచిస్తుంది. దీనిపై జనసేన లీగల్ టీం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తుంది. - టీడీపీ, జనసేన నాయకులు