అధికార పార్టీ ఆగడాలు - రోడ్డుపైనే వేదికలు - స్థానికులకు తప్పని తిప్పలు - YCP meetings on roads
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 7, 2024, 9:28 PM IST
Jagananna Cheyutha Program Held on Main Road: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ (Minister Jogi Ramesh) ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ప్రధాన రహదారులను వేదికలుగా మార్చి గ్రామస్థులను, ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అడిగిన వారిపై పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు పెట్టడం లేదా వైసీపీ నాయకులతో వాగ్వాదాలకు దిగుతున్నారు. గురువారం సాయంత్రం నియోజకవర్గంలోని కంకిపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న చేయూత, పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్థానిక మార్కెట్ యార్డు ఎదురుగా ప్రధాన రహదారిపై వేదికను ఏర్పాటు చేశారు. అయితే దీనికి ఒక కిలోమీటర్ ముందుగానే బస్టాండ్ వద్ద నుంచి ట్రాఫిక్‌ను మళ్లించారు. రహదారిపై వైసీపీ నాయకులు ఆటోలు అడ్డుగా పెట్టారు. ఈ విషయాన్ని పోలీసులకు దృష్టికి తీసుకువస్తే తమకేం తెలియదని సమాధానం ఇచ్చారు. దీంతో తమ మార్గానికి అడ్డుగా ఆటోలు ఎందుకు నిలిపారని స్థానికులు ఆగ్రహించడంతో చేసేదిలేక పోలీసులు ఆటోలను తొలగించారు.