'ఎన్నికల్లో గెలిస్తే ప్రతి ఒక్కరికి 20 వేల డాలర్లు'- గుర్రపు బగ్గీపై వచ్చి వినూత్నంగా నామినేషన్ - Jabalpur Candidate Nomination - JABALPUR CANDIDATE NOMINATION
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-03-2024/640-480-21110897-thumbnail-16x9-nomination.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Mar 31, 2024, 10:35 AM IST
Jabalpur Candidate Unique Nomination : లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే ప్రతి ఒక్కరికి 20,000 డాలర్లు ఇస్తామని హామీ ఇచ్చారు ఓ స్వతంత్ర అభ్యర్థి భర్త. అంతే కాకుండా నామినేషన్ దాఖలు చేసేందుకు గుర్రపు బగ్గీ కలెక్టరేట్‌కు వచ్చారు. వాళ్లే మధ్యప్రదేశ్‌కు చెందిన స్టాన్లీ లూయిస్ జంట.
జబల్పుర్ జిల్లాకు చెందిన స్టానీ లూయిస్ భార్య శశి స్టెల్లా లూయిస్ స్వతంత్ర అభ్యర్థిగా ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. శనివారం నామినేషన్ దాఖలు చేసేందుకు కలెక్టరేట్‌కు దంపతులిద్దరూ గుర్రపు బగ్గీపై వచ్చారు. శశి స్టెల్లా తరపున స్టాన్లీ లూయిస్ నామినేషన్ దాఖలు చేశారు. తన భార్య శశి ఎన్నికల్లో గెలిస్తే జబల్‌పుర్‌లోని ప్రతి వ్యక్తికి 20,000 డాలర్లు ఇస్తామని స్టాన్లీ హామీ ఇచ్చారు. అయితే ఈ డబ్బు ఎక్కడ నుంచి వస్తుందని అని అడగ్గా, అమెరికా అధ్యక్షుడికి లేఖ రాశానని సమాధానం ఇచ్చారు.
కోహినూర్ మాదే అంటూ నోటీసులు
గతంలో స్టాన్లీ రాష్ట్రపతి ఎన్నికలకు కూడా నామినేషన్ పత్రాన్ని పూరించారు. అప్పుడు దేశంలోని ప్రతి కుటుంబానికి ఒక హెలికాప్టర్ ఇస్తామని ప్రకటించారు. ఇదే కాదు కోహినూర్ వజ్రం తమ వారసులదేనంటూ లండన్‌కు నోటీసులు పంపారు. అలాగే స్విస్ బ్యాంకులో డిపాజిట్ అయిన నల్లధనంపై స్విట్జర్లాండ్ గవర్నర్‌కు లేఖ రాశారు. కానీ స్టాన్లీ లూయిస్ తన కుటుంబాన్ని పోషించేందుకు జబలపుర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక చిన్న దుకాణాన్ని నడుపుతున్నారు.