ఆర్టీసీ బస్సు కిందపడి ఇంటర్ విద్యార్థి మృతి - వీడియో వైరల్ - Inter student died falling down bus - INTER STUDENT DIED FALLING DOWN BUS
🎬 Watch Now: Feature Video
Published : Jun 14, 2024, 6:36 PM IST
Inter Student Dies After Falling Down from Bus in Hyderabad : హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు దిగుతుండగా ఇంటర్ విద్యార్థి కాలు జారి కిందపడింది. దీంతో ఒక్కసారిగా ఆ యువతి మీద నుంచి బస్సు వెళ్లింది. వెంటనే గమనించిన స్థానికులు వెంటనే బస్సును నిలిపివేసి యువతి దగ్గరకు వెళ్లారు. అంబులెన్స్‌ను రప్పించి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్ నగరంలో తరుచూ ఇలాంటి ఘటనలు జరుగుతునే ఉన్నాయి. బస్సు ఆగిన తర్వాత దిగాలని ఆర్టీసీ అధికారులు ఎప్పుడు ప్రయాణికులకు సూచిస్తూనే ఉన్నారు. అయినా కొందరు తొందరపాటుతో ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.