ఏపీని మరో గుజరాత్‌లా మార్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా: మంత్రి టీజీ భరత్ - Minister Bharat Interview - MINISTER BHARAT INTERVIEW
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 15, 2024, 3:42 PM IST
Industries Minister TG Bharat Interview: రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తానని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. పరిశ్రమలకు అనుకూల పరిస్థితులు సృష్టించి ఔత్సాహికులను ఆకర్షించేలా ప్రణాళికలు రచిస్తామన్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు రావటం ద్వారానే యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక ప్రగతి కుంటుపడిందని అడ్డగోలు నిబంధనలతో కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవీ తరమివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ముఖ్యమంత్రితో చర్చిస్తానన్నారు.
ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు మరిన్ని పరిశ్రమలు తీసుకువస్తానని పేర్కొన్నారు. నాపై పెట్టిన బాధ్యతను నెరవేర్చేలా పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తానని మంత్రి అన్నారు. అనంతపురం అంటే కియా ఎలా గుర్తు వస్తుందో ఆయా జిల్లాల్లోని మౌలిక వసతులకు అనుగుణంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీని మరో గుజరాత్‌లా మార్చి యువతకు ఉపాధి కల్పిస్తానని టీజీ భరత్ అన్నారు. మంత్రి టీజీ భరత్‌తో మా ప్రతినిధి శ్యామ్ నిర్వహించిన ముఖాముఖిలో మరిన్ని విషయాలు తెలిపారు.