LIVE : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం - PARLIAMENT BUDGET SESSION LIVE - PARLIAMENT BUDGET SESSION LIVE
🎬 Watch Now: Feature Video
Published : Jul 22, 2024, 10:33 AM IST
|Updated : Jul 22, 2024, 1:33 PM IST
Parliament Budget Session Live : కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం (మోదీ సర్కార్ 3.0) మూడోసారి కొలువుదీరిన తర్వాత, తొలిసారి బడ్జెట్‌ను సమర్పించేందుకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. నేడు పార్లమెంట్ ముందు భారత ఆర్థిక సర్వేను ఉంచనున్నారు. మంగళవారం నాడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన 2024 బడ్జెట్ కూడా జూలై 23నే పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. మొత్తంగా ఈ పార్లమెంట్ సెషన్లో కేంద్ర ప్రభుత్వం మొత్తం 6 బిల్లులను సభామోదం కోసం తీసుకురానుంది. మరోవైపు నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, రైల్వే భద్రత, కావడి (కన్వర్) యాత్ర మార్గంలో హోటళ్లపై యజమానుల పేర్లు రాయాలనే నిబంధన వంటి అంశాలపై కేంద్రాన్ని ఐక్యంగా నిలదీయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఈ సందర్భంగా వీటిపై చర్చ జరపాలని లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చింది.
Last Updated : Jul 22, 2024, 1:33 PM IST