ముగిసిన ఐనవోలు పెద్దపట్నం బ్రహ్మోత్సవాలు - అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు - Inavolu Mallanna Brahmotsavam
🎬 Watch Now: Feature Video
Published : Apr 7, 2024, 2:50 PM IST
Inavolu Mallanna Swamy Brahmotsavalu : హనుమకొండ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో పెద్దపట్నం అంగరంగ వైభవంగా ముగిసింది. బ్రహ్మోత్సవాల్లో చివరి ఆదివారం కావడంతో ఆలయంలో నిర్వాహకులు పెద్దపట్నం ఏర్పాటు చేశారు. 300 మందికి పైగా ఒగ్గు పూజారులు 10 గంటలు శ్రమించి తెలంగాణలోనే అతిపెద్ద పెద్దపట్నాన్ని వేశారు. వివిధ రకాల రంగులతో 50 అడుగుల పొడవు 50 అడుగుల వెడల్పుతో సర్వాంగ సుందరంగా పెద్దపట్నం ఏర్పాటు చేశారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున తరలివచ్చారు.
Inavolu Mallanna Swamy Jatara In Hanmakonda : జయజయనాధాల నడుమ భక్తులు పెద్దపట్నాన్ని తొక్కి పులకించిపోయారు. మల్లన్న జయజయనాధాల నడుమ పెద్దపట్నం మహత్తర ఘట్టం భక్తుల కోలాహలం నడుమ ముగిసింది. భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయ పరిసరాల్లోనే విడిది చేస్తూ, నెత్తిన బోనాలు ఎత్తుకుని ప్రదక్షిణలు చేస్తూ, స్వామికి నైవేద్యాలు సమర్పించుకున్నారు. ఆలయ ఆవరణలో శివసత్తుల నృత్యాలు పూనకాలతో హోరెత్తాయి.