రహస్యంగా రుషికొండ రిసార్ట్ ప్రారంభం - ప్రభుత్వం నుంచి కొద్దిమందికే ఆహ్వానాలు - YCP buildings on Rushikonda

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 29, 2024, 9:18 AM IST

Inauguration of Rushikonda Resort in Visakhapatnam: విశాఖలో రుషికొండ రిసార్ట్ ప్రారంభ కార్యక్రమాన్ని ప్రభుత్వం రహస్యంగా చేపడుతోంది. 450 కోట్ల ప్రజాధనంతో నిర్మించినా కొద్దిమందికే ఆహ్వానాలు పంపినట్లు తెలిసింది. సీఎం జగన్, మంత్రి రోజా చిత్రాలతో కూడిన ఆహ్వానపత్రికలను సిద్ధం చేశారు. రుషికొండ పునరుద్ధరణ ప్రాజెక్టు (Rushikonda Renovation Project) ప్రారంభం పేరుతో అధికార పార్టీనేతలకు, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి, ఇతర పాల కమండలి సభ్యులు, ఆయా శాఖల ఉన్నతాధికారులకే ఆహ్వాన పత్రికలను పంపినట్లు తెలిసింది. 

పర్యాటకశాఖ మంత్రి రోజా చేతుల మీదుగా ఈ రోజు ఉదయం 10 గంటలకు లక్ష్మీపూజతో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రే మంత్రి రోజా, ఏపీటీడీసీ (APTDC) ఎండీ కన్నబాబు నగరానికి చేరుకున్నారు. ఇవాళ రుషికొండ భవనాల ప్రారంభోత్సవ వేడుక సందర్భంగా ప్రతిపక్ష నేతలతో కాని స్థానికులతో కాని ఎలాంటి ఘటనలు తలెత్తకుండా రుషికొండ వద్ద భారీగా పోలీసుల మోహరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.