రాష్ట్రంలో సుర్రుమంటున్న సూరీడు - ఇది శాంపిల్ మాత్రమే, ఈ నెలాఖరులో భానుడి ఉగ్రరూపం! - Temparatures Rising in Telangana - TEMPARATURES RISING IN TELANGANA
🎬 Watch Now: Feature Video
Published : Mar 25, 2024, 3:16 PM IST
IMD Officer Shravani Interview : రాష్ట్రవ్యాప్తంగా భానుడు తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ముఖ్యంగా గత 3, 4 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి వేళ ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాధారణం కన్నా ఒక డిగ్రీ అధికంగా నమోదవుతున్నట్లు తెలిపింది.
ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి తెలిపారు. రాత్రి పూట ఉష్ణోగ్రతలు 25 నుంచి 26 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతాయని వెల్లడించారు. ఏప్రిల్ రెండో వారం నుంచి ఎండల తీవ్రత మరింత పెరగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఏప్రిల్, మే నెలల్లో ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందంటున్న వాతావరణ శాఖ అధికారిణి శ్రావణితో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి.