నెల్లూరు జిల్లాలో రెచ్చిపోతున్న తెల్లరాయి మాఫియా - నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 3, 2024, 9:35 PM IST
Illegal White Stone Mining in Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ అడ్డు అదుపూ లేకుండా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అక్రమ మైనింగ్‌పై ప్రతిపక్షాలు పోరు సాగిస్తున్నా, అక్రమ మైనింగ్ మరిగిన వైసీపీ నేతలు అధికారుల అండదండతో చెలరేగిపోతున్నారు. ఇలాంటి తరుణంలోనే జిల్లాలో మరోచోట మైనింగ్‌కు తెరలేపారు. జిల్లాలోని సహజ వనరులను దోపిడిదారులు దోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెల్లరాయి మాఫియా నేతల అండదండతో రెచ్చిపోయింది. మర్రిపాడు మండలం చిలకపాడు రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో బోర్లు వేసి మరి డిటోనేటర్లు, జెలిటన్ స్టిక్స్‌తో భారీ పేలుళ్లకు సిద్ధం చేస్తున్నారు. తెల్లరాయి కోసం బ్లాస్టింగ్‌లకు పాల్పడతారేమో అని స్థానికులు వణికిపోతున్నారు. దీంతో అక్రమ తవ్వకాలను అక్కడి నివాసితులు అడ్డుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి మనుషులమంటూ తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.