ప్రకృతిపై మమకారంతో ఐఎఫ్ఎస్కు ఎంపిక- ఆలిండియా 83వ ర్యాంకుతో సత్తా చాటిన యువకుడు - IFS Top Ranker Krishna Chaitanya
🎬 Watch Now: Feature Video
IFS Top Ranker Krishna Chaitanya Success Story: మనసుకు నచ్చిన పని చేస్తే కలిగే ఆనందం వెలకట్టలేనిది. ఒక్కోసారి లక్షల జీతాలు వచ్చే ఉద్యోగం చేసినా సంతృప్తి ఉండదు. ఏదో తెలియని వెలితి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ విషయాన్ని కాస్త ముందుగానే గ్రహించాడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన కృష్ణచైతన్య అనే యువకుడు. చిన్నప్పుడు తనకు ఆహ్లాదాన్ని పంచిన ప్రకృతిపై మమకారం పెంచుకున్నాడు. ఎలాగైనా ప్రకృతికి దగ్గరవ్వాలని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌ను ఎంచుకున్నాడు.
ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఆలిండియా 83వ ర్యాంకుతో సత్తాచాటాడు. స్పష్టమైన గోల్‌ను ఏర్పాటు చేసుకుని నిర్దేశిత ప్రణాళిక ప్రకారం కష్టపడి చదివితే సివిల్స్‌లో విజయం సాధించడం చాలా సులువని ఈ యువకుడు అంటున్నాడు. ఈ దిశగా నేటి తరం యువత కృషి చేయాలని సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు సూచించారు. ఈ నేపథ్యంలో తన లక్ష్య సాధనకు కృష్ణచైతన్య చేసిన కృషేంటి? ఈ విజయం ఆయన్ను ఎలా వరించింది? వంటి విషయాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.