అక్రమ నిర్మాణాలపై హైడ్రా పంజా - దేవేందర్ నగర్‌లోని 51 గదులు కూల్చివేత - Hydra Demolish Illegal Construction - HYDRA DEMOLISH ILLEGAL CONSTRUCTION
🎬 Watch Now: Feature Video
Published : Aug 6, 2024, 5:16 PM IST
Demolition Unauthorized Construction on Govt Land : రాష్ట్ర రాజధాని నగరంలో అక్రమ ఆక్రమణలను పరిష్కరించేందుకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) చర్యలు చేపట్టింది. దేవేందర్ నగర్‌లోని ఫుల్ ట్యాంక్ లెవెల్ వద్ద 51 అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. అదనంగా రాజధాని నగరం అంతటా ఉన్న సరస్సులపై ఆక్రమణలను గుర్తించి పరిష్కరించే ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ కీలకమైన హైడ్రా వనరులను పునరుద్ధరించడం సహా రక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈమేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సర్కిల్ 26 , గాజులరామారం, దేవేందర్ నగర్లో హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. గత కొంత కాలంగా ప్రభుత్వ భూములను ఆక్రమించి, అక్రమంగా కట్టిన దాదాపు 51 గదులను స్థానిక ప్రజల ఫిర్యాదుల మేరకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కూల్చివేతకు ఆదేశాలు జారీ చేశారు. దేవేందర్ నగర్‌లోని సర్వే నంబర్ 329లో కోట్ల రూపాయలు విలువ గల ప్రభుత్వ స్థలంలో అక్రమాలను భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు జరిపారు.