బెంగళూరులో పేలుడు - అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు - Police checks in hyderabad
🎬 Watch Now: Feature Video


Published : Mar 1, 2024, 10:47 PM IST
Hyderabad Police on Alert After Bangaluru Blast : కర్ణాటక బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో పేలుడు దృష్ట్యా హైదరాబాద్ నగర పోలీసులు యంత్రాంగం అప్రమత్తమైంది. బెంగళూరులోని కేఫ్‌లో పేలుళ్లు నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. జూబ్లీ బస్ స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మారేడుపల్లి గణేశ్ దేవాలయం, ఓఏసీ సెంటర్లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనాలు, కార్లను ఆపి తనిఖీలు చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన వారిని గుర్తించి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.
Bangaluru Rameshwaram Cafe Blast : శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించింది. ఈ పేలుడుకు తొమ్మిది మందికి గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ పేలుడు పట్ల ఎన్ఐఏ, పోరెన్సిక్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. దీంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. వెంటనే హైదరాబాద్‌లో కూడా పోలీసులు అప్రమత్తమై తనిఖీలు నిర్వహిస్తున్నారు.