LIVE : హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత నామినేషన్ - madhavi latha nomination live - MADHAVI LATHA NOMINATION LIVE
🎬 Watch Now: Feature Video
Published : Apr 24, 2024, 10:12 AM IST
|Updated : Apr 24, 2024, 10:21 AM IST
Madhavi Latha Nomination Live : తెలంగాణలో అధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. జాతీయ నేతల దిశానిర్దేశంతో ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో వెళ్తున్న అభ్యర్థులు, పార్టీ శ్రేణులు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీల అమలు తీరుపై విమర్శలు గుప్పిస్తూ ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేయగా మరికొందరు నామపత్రాలు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.తాజాగా నేడు హైదారాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా మాధవీలత నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ హాజరుకానున్నారు. అంతకుముందు ఆమె భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం చార్మినార్ నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు నామినేషన్ ర్యాలీ చేపట్టనున్నారు. హైదారాబాద్ కలెక్టరేట్‌లో ఆర్వోకు మాధవీలత నామపత్రాలు అందించనున్నారు. ఈ స్థానం నుంచి ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసద్దుదీన్ ఓవైసీ పోటీ పడుతుండగా, బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ ఇంకా ఈ స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేదు.
Last Updated : Apr 24, 2024, 10:21 AM IST