తప్పుడు పనులు వద్దన్న భర్త - వినని భార్య - ఆపై ఏం జరిగిందంటే ! - Husband Killed Wife - HUSBAND KILLED WIFE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 13, 2024, 10:26 AM IST
Husband Killed Wife in Proddatur : పార్క్‌కు వెళ్దామంటూ భార్యను తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసిన ఘటన వైఎస్సార్ జిల్లాలో జరిగింది. ప్రొద్దుటూరు అమృతనగర్‌కు చెందిన అన్వర్ బాషా, మైలవరం మండలం దొడియంకు చెందిన రేష్మ అనే దంపతులకు 10 ఏళ్ల కిందట వివాహం జరిగింది. భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే విషయం అన్వర్‌కు తెలియడంతో ఆమెను పలుమార్లు మందిలించినా ఎలాంటి మార్పు రాలేదు.
కొన్ని రోజుల క్రితం దంపతుల మధ్య గొడవ జరగడంతో ఈశ్వరరెడ్డి నగర్‌లోని తన బంధువుల ఇంటికి రేష్మ వెళ్లిపోయింది. అన్వర్ అక్కడికి వెళ్లి ఆమెను పార్క్‌కు తీసుకువెళ్లాడు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య మాటమాట పెరగడంతో భార్యను గొంతునులిమి హత్యచేసి అక్కడే గొయ్యి తీసి పూడ్చిపెట్టాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రేష్మ మృతదేహాన్నివెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.