thumbnail

ఏపీలో కొత్త స్టాక్ చూశారా! - గుడివాడ లిక్కర్ గోడౌన్​లో సందడి

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Huge People At Gudivada Liquor Godown : కృష్ణాజిల్లా గుడివాడలోని లిక్కర్ గోడౌన్​లో సందడి నెలకొంది. ఏపీలో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ పూర్తికావడంతో లాటరీలో దుకాణం పొందిన వారితో స్టాక్ తీసుకున్నందుకు వచ్చిన వ్యాపారులతో గుడివాడలోని డిపో ప్రాంగణం నిండిపోయింది. గుడివాడ డిపో పరిధిలోని 107 మద్యం దుకాణాల నిర్వాహకులకు స్టాక్ అందిస్తామని డిపో మేనేజర్ విజయబాబు తెలియజేశారు. లైసెన్స్ ఫీజు చెల్లించిన వారు డిపోకు వచ్చి తమకు కావాల్సిన మద్యం తీసుకెళ్లవచ్చని ఆయన సూచించారు.

దుకాణాలు దక్కించుకున్న వారందరూ బుధవారం నిర్దేశించుకున్న ప్రాంతాల్లో వాటిని ప్రారంభించాల్సి ఉంది. దీంతో వారంతా ఎక్కడైతే బాగుంటుందో ఆ ప్రాంతాల్లోని స్థలాల కోసం వెతుకులాట ప్రారంభించారు. దుకాణాలు పొందిన వారిలో చాలామంది లిక్కర్‌ వ్యాపారులు కావడంతో ముందే వారికి వివిధ ప్రాంతాల్లో స్థలాలు సిద్ధం చేసుకున్నారు. దుకాణాలు నిర్వహిస్తున్న వారిలో కూడా అనేక మందికి ఈసారి లాటరీ రాలేదు. దీంతో ప్రదేశం కోసం కొందరు వారితో సంప్రదింపులు చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.