ఉడుమును తరుముతూ ఇంట్లోకి 11 అడుగుల కింగ్ కోబ్రా- ఆ తర్వాత ఏమైందంటే? లైవ్ వీడియో! - Huge King Cobra Rescue In Odisha - HUGE KING COBRA RESCUE IN ODISHA
🎬 Watch Now: Feature Video
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Sep 3, 2024, 3:33 PM IST
Huge King Cobra Rescue In Odisha : ఒడిశా మయూర్భంజ్ జిల్లా బంగ్రా గ్రామంలో 11 అడుగుల భారీ నాగుపాము సోమవారం కలకలం సృష్టించింది. గ్రామంలోని ఓ ఇంట్లో 6.7 కిలోలు బరువున్న నాగును చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న దుల్కా వైల్డ్‌లైఫ్ రేంజ్ అటవీ శాఖ సిబ్బంది, పామును పట్టుకున్నారు. నాగును స్థానిక వెటర్నరీ వైద్యుడు పరిశీలించిన తర్వాత సురక్షిత ప్రాంతంలో మంగళవారం విడిచిపెట్టారు. కాగా, పామును సురక్షితంగా పట్టుకున్నట్లు స్నేక్ క్యాచర్ తెలిపారు. ఉడుమును తరుముకుంటూ పాము ఇంట్లోకి వచ్చిందని చెప్పాడు.
పాముతో కుక్క ఫైట్ - ప్రాణాలకు తెగించి యజమానిని కాపాడిన 'డైసీ'
ఇటీవలే ఇంట్లోకి వచ్చిన పాముతో తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడింది ఓ శునకం. తన యజమానిని పెను ప్రమాదం నుంచి తప్పించింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో జరిగింది. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.