భద్రాద్రిలో పోటెత్తిన భక్తజనం - కొనసాగుతున్న భక్తుల రద్దీ - Devotees Rush
🎬 Watch Now: Feature Video
Published : May 25, 2024, 12:07 PM IST
Huge Devotees Rush in Bhadrachalam Temple : భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల సందర్భంగా గత కొన్ని రోజుల నుంచి భక్తులు స్వామివారి దర్శనం కోసం అధిక సంఖ్యలో వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో స్వామివారి దర్శనానికి వెళ్లడంతో ఆలయ ప్రాంతాలన్నీ రద్దీగా మారుతున్నాయి. ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనం క్యూలైన్ల్లో భక్తులు కిటకిటలాడుతున్నారు.
Rathotsavam in Bhadrachalam : శనివారం సందర్భంగా ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల మూలమూర్తులకు ఆలయ అర్చకులు బంగారు తులసీదళాలతో అర్చన చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా బేడా మండపంలో నిర్వహించాల్సిన నిత్య కల్యాణ వేడుకను ఆలయ పరిసరాల్లో ఉన్న చిత్రకూట మండపంలో నిర్వహిస్తున్నారు. నిన్న రామాలయంలో బంగారు కవచాలతో సీతారాముల దర్శనం ఘనంగా జరిగింది. యోగానంద లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో తిరుకల్యాణ మహోత్సవాలు నిర్వహించగా సాయంత్రం లక్ష్మీనరసింహస్వామికి రథోత్సవం వైభవంగా జరిగింది.