గుడివాడలో కదం తొక్కిన పసుపు దళం - వెనిగండ్ల రాముకు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ - Venigandla Ramu Campaign Gudivada - VENIGANDLA RAMU CAMPAIGN GUDIVADA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 11, 2024, 5:08 PM IST
Huge Bike Rally in Support of Venigandla Ramu in Gudivada Constituency : గుడివాడలో పసుపు దళం కదం తొక్కింది. గుడివాడ నియోజకర్గ తెలుగుదేశం అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతుగా కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి రాముకు మద్దతు తెలిపారు. తెలుగుదేశం శ్రేణుల ప్రదర్శనతో వీధులు మొత్తం పసుపుమయంగా మారాయి. ఈ ఎన్నికల ద్వారా కొడాలి నానికి రాజకీయ సమాధి కడతామని స్పష్టం చేశారు.
ఎవరైతే మన గుడివాడను మారుస్తారో వారికే ఓటు వేసి గెలిపించండని గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము కోరారు. గంటసేపు వర్షానికే ప్రజలు పడుతున్న అగచాట్లు, దారుణంగా ఉన్నాయన్నారు. మరోవైపు సక్రమంగా తాగు నీరు అందక నియోజకవర్గ ప్రజలందరూ అలమటిస్తున్నారన్నారు. ఏడాదిలో రెండు రోజులు అధికారులతో రివ్యూ చేస్తే ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేవి. గుడివాడ నియోజకవర్గంలో సమస్యలు లేని వార్డు గానీ, గ్రామం గానీ లేదన్నారు. కూటమి అధికారంలోకి రాగానే ప్రజలకు అన్ని సదుపాయాలు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.