నేరస్థుడికి పార్టీ, కులం ఉండదు - వారిని కఠినంగా శిక్షిస్తాం: హోంమంత్రి అనిత - Home Minister on Rape Incidents - HOME MINISTER ON RAPE INCIDENTS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 15, 2024, 3:47 PM IST

Home Minister on Rape Incidents: రాష్ట్రంలో శాంతి భద్రతలు, గంజాయి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. నంద్యాల జిల్లా మచ్చుమర్రి, విజయనగరంలో జరిగిన ఘటనలు అత్యంత హేయం, దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైకంలో తాత వరుస వ్యక్తి చిన్నారిపై అత్యాచారం చేశాడని మండిపడ్డారు. మచ్చుమార్రిలో బాలికను హత్య చేసి రాయి కట్టి మరీ రిజర్వాయర్​లోకి తోశారన్నారు. ఈ ఘటనల్లో బాలికల కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారని చెప్పారు. ముచ్చుమర్రి కేసులో బాలిక కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం, విజయనగరం అత్యాచార ఘటనలో బాలికపై రూ.5 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తామని తెలిపారు.  

మద్యం, గంజాయి, డ్రగ్స్ మత్తులో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. ఈ రెండు అంశాలపై ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరపాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. మచ్చుమర్రి ఘటనలో మైనర్​లు ఉన్నారని చెప్పారు. ఫోన్‌లలో అశ్లీల వెబ్ సైట్​లు అందుబాటులోకి వస్తుండటమూ ఈ తరహా ఘటనలకు కారణం అవుతోందన్నారు. క్రిమినల్​కు పార్టీ, కులం ఉండదని, వారికి శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. అత్యాచార నిందితులను కఠినంగా శిక్షిస్తామని, తప్పుచేసిన వారెవరైనా వదిలేది లేదని తెలిపారు. ఆడపిల్లపై అసభ్యంగా ప్రవర్తించిన వారికి అదే ఆఖరి రోజు అవుతుందని హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.