గత ప్రభుత్వం రాజకీయ అవసరాలకే పోలీసులను వాడుకుంది: హోంమంత్రి అనిత - Home Minister On Police in Assembly
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 23, 2024, 5:38 PM IST
Home Minister Anitha Spoke at Assembly on Police System : పోలీసు వ్యవస్థపై అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర చర్చ జరిగింది. 19వేలకు పైగా పోలీసు సిబ్బంది కొరత ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షణ ఎలా ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు. అలాగే కాలం చెల్లిన డొక్కు పెట్రోలింగ్ వాహనాలు రోడ్లపై నడుస్తున్నాయన్నారు. వీఆర్‌లో పెట్టిన పోలీసులకు జీతభత్యాలు కూడా ఇవ్వలేదని ప్రశ్నించారు. దీనికి స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత, గత ప్రభుత్వంలో రాజకీయ అవసరాలకే పోలీసులను వాడుకున్నారు తప్ప వారికి సరైన సౌకర్యాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
కొన్ని కులాలకు చెందిన పోలీసు అధికారులను జగన్ సర్కార్ కక్ష కట్టి వీఆర్‌కు పంపారని ఆరోపించారు. పోలీసు శాఖలో 19వేలకు పైగా ఖాళీలు ఉన్నా భర్తీ చేయలేదని తెలిపారు. పోలీసులను శాంతిభద్రతల కోసం కాకుండా రాజకీయంగా వాడుకున్న జగన్ ఇప్పుడు చట్టం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తమ ప్రభుత్వంలో వ్యవస్థల దుర్వినియోగం ఉండదని పోలీసుల సంక్షేమాన్ని కృషి చేస్తామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.