సిద్దిపేటలో టెన్షన్​ టెన్షన్ - ఉద్రిక్తతతకు దారితీసిన బీఆర్ఎస్ ధర్నా - High Tension In Siddipet - HIGH TENSION IN SIDDIPET

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 17, 2024, 5:10 PM IST

High Tension In Siddipet : ఫ్లెక్సీ వివాదంతో సిద్దిపేటలో హైటెన్షన్​ మొదలైంది. బీఆర్ఎస్​, కాంగ్రెస్​ నాయకుల నినాదాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి హరీశ్​రావు క్యాంప్​ కార్యాలయంపై ఉన్న ఫ్లెక్సీని కాంగ్రెస్ నాయకులు చింపడం వాగ్వాదానికి దారితీసింది. కాంగ్రెస్​, బీఆర్ఎస్​ నాయకులు పోటాపోటీ నినాదాలతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. పరిస్థితిని అదుపులోనికి తెచ్చేందుకు పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టి వివాదాన్ని సద్దుమణిగించారు. బీఆర్ఎస్​ క్యాంప్​ కార్యాలయంపై ఫ్లెక్సీలు చింపిన ఘటనకు నిరసనగా శనివారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్​ వద్ద ధర్నా చేపట్టారు. 

ఈ సందర్భంగా బీఆర్ఎస్​ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే హరీశ్​ రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సమంజసం కాదన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ అసంపూర్తిగా ఉందన్నారు. ఏ గ్రామంలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగిందో చూపించాలన్నారు. బస్టాండ్ వద్ద హోర్డింగ్​పై ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను బీఆర్ఎస్​ నాయకులు చింపేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.