ఏదైనా గ్రహానికి వెళ్లి రిపోర్టు తేవాలా ? - అక్రమ మైనింగ్​పై ప్రశ్నించిన హైకోర్టు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 28, 2024, 5:59 PM IST

High Court on Illegal Mining in Guntur : గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వీరంకినాయుడు పాలెంలో అక్రమ మైనింగ్​పై ఎం. ప్రభుదాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరుపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. డీకే పట్టా భూమి 60 ఏకరాల్లో రెండు ఎకరాల్లో అనుమతి తీసుకున్నారని న్యాయవాది నర్రా చెప్పారు. 60 ఎకరాల్లో ఫెన్సింగ్ వేసి మైనింగ్ చేస్తున్నారని ఫొటోలతో సహా న్యాయవాది చూపించారు. డీకే పట్టా భూముల్లో మైనింగ్ ఎలా చేస్తారని ధర్మాసనం ప్రతివాదులను ప్రశ్నించింది. 

అక్రమ మైనింగ్​పై అనేక ఫిర్యాదులు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని మైనింగ్ శాఖను ఆదేశించింది. అందుకు న్యాయవాది రెండు వారాల సమయం సరిపోదని తెలిపితే, ఏదైనా గ్రహానికి వెళ్లి రిపోర్టు తేవాలా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మైనింగ్ శాఖ ఇచ్చే నివేదికలో తేడా ఉంటే స్థానికంగా ఉన్న న్యాయాధికారితో విచారణ జరిపిస్తామని హైకోర్టు పేర్కొంది. తప్పని తేలితే అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరించింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.