వరద బాధితులకు హైకోర్టు న్యాయవాదులు సాయం - ఆహారం అందజేత - Lawyers Help to Flooded Area People

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2024, 10:13 PM IST

thumbnail
వరద బాధితులకు సాయం చేసిన హైకోర్టు న్యాయవాదులు - ఆహారం అందజేత (ETV Bharat)

High Court Lawyers Help to Flooded Area People in Vijayawada: విజయవాడ నగరంలో వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు హైకోర్టు న్యాయవాదుల సమక్షంలో 'టీం స్వేచ్ఛ ఆధ్వర్యంలో వంద మంది పని చేశారు. వందమంది వాలంటీర్లు వరద బాధితులకు సహాయ కార్యక్రమాలు అందించారు. స్వాతి థియేటర్ రోడ్డు, భవానీపురంలోని ముంపు ప్రాంతాల్లో ఆహారం పంపిణీ చేశారు. ముంపు ప్రమాదంలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ట్యూబులు, బోట్ల ద్వారా పీవీపీ సిద్ధార్థ విద్యార్థులు సాయం చేశారు. ఇళ్లలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

హైకోర్టు న్యాయవాది పదిరి రవితేజ వరద బాధితులకు కావల్సిన ఆర్థిక సహాయం, ఆహారంతో పాటు ఇతర సదుపాయాలు కల్పించారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు హైకోర్టు న్యాయవాదులు కూడా ధైర్యంగా ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది దామోదర్, సురేష్ తదితరులు పర్యవేక్షించారు. రబ్బర్​ ట్యూబులు, బోటుల సాయంతోపాటు వరదల్లో మునిగిపోతున్న వారిని టీం స్వేచ్ఛ ద్వారా వాలంటీర్లు ప్రజలను కాపాడారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.