చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం- బెజవాడలో భారీ ట్రాఫిక్ జామ్ - Heavy Traffic Jam at Vijayawada - HEAVY TRAFFIC JAM AT VIJAYAWADA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 12, 2024, 3:13 PM IST
Heavy Traffic Jam at Vijayawada: చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూసేందుకు లక్షలాది మంది ప్రజలు బెజవాడకు తరలివచ్చారు. అన్ని ప్రాంతాల దారులన్నీ విజయవాడ వైపే తరలాయి. వేలాదిగా వస్తున్న వాహనాలతో జాతీయ రహదారులపై కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. లెక్కకు మించి వచ్చిన వాహనాలతో కేసరపల్లి నుంచి వారధి వరకు 25 కిలోమీటర్ల మేర ట్రాపిక్ జాం అయింది. దీంతో తమ అభిమాన నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్, మిగిలిన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని కళ్లారా చూద్దామని వ్యయ ప్రయాసల కోర్చి వచ్చిన వేలాది మంది ప్రత్యక్షంగా చూడలేకపోయారు. ఇప్పటికీ ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనై తిరుగు పయనమయ్యారు. ముఖ్యఅతిధిగా ప్రధాని విచ్చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజలు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా హజరవుతారని అధికారులు ముందుగానే అంచనా వేశారు. దానికి అనుగుణంగా మూడు జిల్లాల నుంచి దాదాపు 10 వేల అదనపు బలగాలను రప్పించారు. అయినా ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జాం కావడం చర్చాంశనీయమైంది. విజయవాడలో నెలకొన్న ట్రాఫిక్ జాం పరిస్థితిని మా ప్రతినిధి వెంకటరమణ వివరిస్తారు.