నాగార్జునసాగర్‌కు భారీ వరద - పెరుగుతున్న సందర్శకుల తాకిడి - FLOOD FLOW TO NAGARJUNA SAGAR - FLOOD FLOW TO NAGARJUNA SAGAR
🎬 Watch Now: Feature Video
Published : Jul 30, 2024, 12:53 PM IST
Heavy Flood Flow To Nagarjuna Sagar : నాగార్జున సాగర్ జలాశయం జలకళ సంతరించుకుంది. గత వారం రోజులుగా వరద ప్రవాహం పెరగడం, శ్రీశైలం జలాశయ గేట్లెత్తడంతో నీటి ప్రవాహం మరింత ఎక్కువైంది. దీంతో సందర్శకుల తాకిడి కూడా బాగా పెరిగింది. ప్రాజెక్టును పర్యాటకులు సందర్శిస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం మొత్తం నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 515.10 అడుగులకు చేరింది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 140.49 టీఎంసీలకు చేరుకుంది.
నాగార్జున సాగర్‌కు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో లక్షా 4వేల 2వందలు క్యూసెక్కులు వస్తోంది. సాగర్ కుడి కాల్వకు 5వేల 944 క్యూసెక్కులు నీరు, ఎస్ఎల్బీసీకి తాగునీటి 450 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం నీరు ప్రవాహం పెరుగుతుండడంతో ఎడుమ కాలువ కింద రైతన్నలు సాగుకు సిద్ధం అవుతున్నారు. కాగా సాగు నీటి విడుదలపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.