మరింతగా పెరిగిన డయేరియా కేసులు- ఆందోళన వద్దంటున్న మంత్రి రజనీ - Guntur Diarrhea Issue

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 12, 2024, 7:38 PM IST

Health Minister Vidadala Rajani: వాంతులు, విరేచనాలతో బాధపడుతూ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరిన వారి సంఖ్య సోమవారం స్వల్పంగా పెరిగింది. ఈ లక్షణాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య 75కు చేరిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. దీనిపై కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం అధికారులతో రజనీ సమీక్ష నిర్వహించారు. వాంతులు, విరోచనాలతో ప్రజలు ఆసుపత్రిలో చేరడంపై, ఐదుగురు సభ్యులతో కూడిన బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇంటింటా సర్వే చేస్తున్నామని మంత్రి వివరించారు.

ఇప్పుడున్న పరిస్థితులపై ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారులంతా నిరంతరం అప్రమత్తంగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే తాగునీరు, ఆహారం నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపిన విషయాన్ని రజనీ గుర్తు చేశారు. వాటి నివేదిక అందిన వెంటనే, రిపోర్టులో వచ్చిన ఫలితాలకు అనుగుణంగా చర్యలు చేపడతామన్నారు. ఆసుపత్రిలో చేరిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. గుంటూరు నగరంతో పాటు జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల నుంచి కూడా ఇదే సమస్యతో ప్రజలు ఆసుపత్రిలో చేరినట్లు మంత్రి వివరించారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.