విద్యార్థులందరూ కంప్యూటర్ యుగం పరిజ్ఞానం పెంపొందించుకోవాలి : హరీశ్ రావు - Digital Education In Siddipet
🎬 Watch Now: Feature Video
Published : Feb 21, 2024, 8:53 PM IST
Harish Rao on Digital Teaching : రాబోయేది మొత్తం కంప్యూటర్ యుగమేనని విద్యార్థులందరూ కంప్యూటర్ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే హరీశ్ రావు సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ బోధన కోసం 8 క్లాస్‌రూమ్‌లలో 8 స్క్రీన్లు ఏర్పాటు చేశారు. పనులు పూర్తయినందున మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు వీటిని ప్రారంభించారు. ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల మాదిరిగా గర్ల్స్ స్కూల్‌ను అభివృద్ధి చేస్తానని మాజీమంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు పరీక్షలలో 10/10 జీపీఏ సాధించాలని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా సిద్దిపేటకు గుర్తింపు ఉందని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకున్నప్పుడే మంచి గుర్తింపు లభిస్తుందని హరీశ్ రావు తెలిపారు.
Digital Education In Siddipet District : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కృషితో సిద్దిపేట నియోజకవర్గం విద్యారంగంలో విరాజిల్లుతుంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హరీశ్‌రావు చొరవ నాట్కో సౌజన్యంతో ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలను డిజిటల్ బోధన, కంప్యూటర్ ల్యాబ్‌తో కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. అదే తరహాలో మల్టీపర్పస్ హైస్కూల్, గర్ల్స్ హైస్కూళ్లను అభివృద్ధి చేశారు.