రఘునందన్ రావుకు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు - Harish Rao Greetings Raghunandanrao - HARISH RAO GREETINGS RAGHUNANDANRAO
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-06-2024/640-480-21694338-thumbnail-16x9-harish.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jun 12, 2024, 3:46 PM IST
Harish Rao Greetings To Raghunandanrao : సిద్దిపేటలో రాజకీయంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లాలో ప్రధాన ప్రత్యర్థులుగా ఉండి మాటల తూటాలతో బాంబులు పేల్చే నేతలు మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ రఘునందన్‌రావు ఒకే వేదికను పంచుకున్నారు. ఎంపీగా గెలుపొందినందుకు రఘునందన్‌రావుకి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఇద్దరి పార్టీలు వేర్వేరు అయినా వారికున్న క్రేజ్ మామూలుగా ఉండదు. రాజకీయాల్లో ఒకరంటే ఒకరికి పడదు. అలాంటి నేతలు ఎంపీ ఎన్నికల్లో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఆ ఇద్దరు నేతలు ఎదురెదురు పడి ఆప్యాయంగా పలకరించుకున్నారు.
సిద్దిపేటలో శివపార్వతుల కల్యాణంలో ఇద్దరు కలిసి పాల్గొన్నారు. పక్కపక్కనే కూర్చున్నారు. ఈ సన్నివేశాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుపై 39,139 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మాజీ మంత్రి హరీశ్‌రావు మెదక్‌లో బీఆర్ఎస్ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. కనీసం బీఆర్ఎస్కు సమీప ప్రత్యర్థి స్థానం కూడా దక్కకుండా మూడో స్థానానికి పరిమితమైంది.